India: దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు వన్డేలను రద్దు చేసిన బీసీసీఐ

ODI matches between India and South Africa cancelled due to corona outbreak
  • క్రికెట్ మ్యాచ్ లపై కరోనా పంజా
  • ఇప్పటికే వాయిదాపడిన ఐపీఎల్
  • తాజాగా టీమిండియా-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు
  • స్వదేశానికి పయనమైన సఫారీలు
కరోనా వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడంతో ఇప్పటికే ఐపీఎల్ వాయిదా వేసిన బీసీసీఐ తాజాగా, టీమిండియా-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ధర్మశాలలో తొలి వన్డే జరగాల్సి ఉండగా, ఆ మ్యాచ్ వర్షార్పణం అయింది. దాంతో మిగిలిన రెండు వన్డేలను ప్రేక్షకులను అనుమతించకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని భావించారు. అయినప్పటికీ కరోనాపై ఆందోళనలు అంతకంతకూ అధికమవుతుండడంతో మిగిలిన రెండు వన్డేలు రద్దు చేయడమే మంచిదని నిర్ణయించారు. లక్నోలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు ఢిల్లీ చేరుకుని అందుబాటులో ఏ విమానం ఉంటే దాంట్లో స్వదేశానికి వెళ్లనుంది.
India
South Africa
ODI Series
Abandoned
Corona Virus

More Telugu News