Kotla surya prakash reddy: కేఈ ప్రభాకర్​ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు: కోట్ల సూర్యప్రకాశ్​ రెడ్డి

Kotla surya prakash reddy rebuked allegations of KE Prabhaker
  • ఏ విషయంలోనూ ప్రభాకర్ కు నేను అభ్యంతరం చెప్పలేదు
  • నాపై ఆయన నిందలు ఎందుకు వేస్తున్నారో?
  • కేఈ సోదరుడు కృష్ణమూర్తితో నా సంబంధాలు బాగానే ఉన్నాయి
ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కర్నూలు టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో కేఈ, తాను మాట్లాడుకోలేదని అన్నారు. కేఈ ప్రభాకర్ కు సంబంధించిన ఏ విషయంలో కూడా తాను అభ్యంతరం చెప్పలేదని, మరి, ఎందుకో తనపై ఆయన నిందలు వేస్తున్నారని అన్నారు.

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తాను ఎవరినీ సిఫారసు చేయలేదని అన్నారు. కర్నూలు జిల్లా టీడీపీలో తాను పెత్తనం చెలాయిస్తున్నానన్న కేఈ ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. తానూ సామాన్య కార్యకర్త లాంటి వాడినేనని, తనకు ఎటువంటి పదవి లేనప్పుడు పెత్తనం ఎలా చెలాయిస్తాను? అని ప్రశ్నించారు. డోన్ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపికలో తానేమీ జోక్యం చేసుకోలేదని అన్నారు. టీడీపీ నేత, కేఈ ప్రభాకర్ సోదరుడు అయిన కేఈ కృష్ణమూర్తితో తన సంబంధాలు బాగానే ఉన్నాయని, తమ మధ్య ఎటువంటి వివాదాలు లేవని పార్టీ కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
Kotla surya prakash reddy
Telugudesam
KE Prabhaker
Kurnool

More Telugu News