BJP: వైసీపీ దౌర్జన్యాలు చేస్తోందంటూ అమిత్​ షాకు బీజేపీ ఎంపీల లేఖ

BJP leaders has written a letter to central minister Amit shah
  • స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంపీల ఫిర్యాదు 
  • నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేతల బెదిరింపు
  • పోలీసులు కూడా బెదిరిస్తున్నారు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ దౌర్జన్యాలు చేస్తోందంటూ కేంద్ర మంత్రి అమిత్ షాకు బీజేపీ ఎంపీలు టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు ఓ లేఖ రాశారు. తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షపార్టీల అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, అధికార పార్టీకి ఎన్నికల అధికారులు సహకరిస్తున్నారని, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులు కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగుల తొలగింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. 
BJP
TG Venkatesh
CM Ramesh
GVL Narasimha Rao
Amit Shah
letter

More Telugu News