Telugudesam: టీడీపీ అభ్యర్థి నివాసంలో మందు సీసాలు పెట్టిన దుండగులు.... సీసీ టీవీలో అంతా నిక్షిప్తం.. వీడియో ఇదిగో!

Unidentified man keeps liquor bottles in TDP candidate house in Tenali
  • తెనాలి మున్సిపల్ సమరం హోరాహోరీ
  • టీడీపీ అభ్యర్థి ఇంట్లో కావాలనే మందు సీసాలు ఉంచిన దుండగులు
  • ఉదయాన్నే అభ్యర్థి నివాసంపై ఆబ్కారీ అధికారుల దాడులు
  • నేరుగా మద్యం సీసాల కేసు ఉంచిన చోటుకు వెళ్లిన అధికారులు
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మాదిరే తెనాలి పురపాలక ఎన్నికల సమరం కూడా హోరాహోరీ తప్పదని భావిస్తున్నారు. అయితే, ప్రత్యర్థులను కేసుల్లో ఇరికించేందుకు వైరి పక్షాలు ఎలాంటి ఎత్తుగడలకు పాల్పడతాయో చెప్పే ఘటన తెనాలిలో చోటుచేసుకుంది. తెనాలి నాలుగో వార్డులో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి నివాసంలో ఓ వ్యక్తి దొంగచాటుగా మద్యంసీసాల కేసు ఉంచడం సీసీ కెమెరాలకు దొరికిపోయింది. టీడీపీ అభ్యర్థిని ఎక్సైజ్ కేసుల్లో ఇరికించాలన్నది ప్రత్యర్థుల ప్లాన్ అని ఈ చర్య ద్వారా వెల్లడైంది.

అర్థరాత్రి దాటిన తర్వాత ఆ అభ్యర్థి ఇంటివద్దకు ఇద్దరు ఆగంతుకులు బైక్ పై వచ్చారు. గేటు మూసివేసి ఉండడంతో వారిలో ఒకరు గోడ దూకి లోపలికి ప్రవేశించారు. బయట ఉన్న వ్యక్తి అందించిన మద్యంసీసాల కేసును అందుకుని మెట్లమీదుగా టెర్రస్ పైకి చేరుకుని అక్కడున్న వాటర్ ట్యాంక్ కింద ఆ కేసును ఉంచాడు. మళ్లీ ఏమీ తెలియనట్టుగా నింపాదిగా కిందికి వచ్చి బైక్ పై వెళ్లిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.

అయితే మరుసటి రోజు ఉదయమే ఆబ్కారీ అధికారులు టీడీపీ అభ్యర్థి నివాసంపై దాడి చేశారు. నేరుగా టెర్రస్ పైకి వెళ్లి అక్కడున్న మద్యంసీసాల కేసును స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంట్లో లేకపోవడంతో ఆయన బంధువును ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Telugudesam
Tenali
Municipal Elections
CCTV
Liquor Bottles

More Telugu News