Chiranjeevi: చిరంజీవిని ఫుల్ కామెడీ యాంగిల్ లో చూపించబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్!

Trivikram Srinivas planning to show Chiranjeevi in full comedy role
  • చిరంజీవితో సినిమాను తెరకెక్కించబోతున్న త్రివిక్రమ్
  • ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం
  • ఖుషీ అవుతున్న మెగా ఫ్యాన్స్
రాజకీయాల తర్వాత నటనలో సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించిన తర్వాత చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శకులందరూ కథలను రెడీ చేసుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో కలిసి చిరంజీవి సినిమా చేస్తున్నారు.

మరోవైపు, మెగాస్టార్ తో చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సిద్ధమవుతున్నారు. ఇక ఈ చిత్రంలో చిరును పూర్తిగా కామెడీ యాంగిల్ లో చూపించబోతున్నారని టాలీవుడ్ టాక్. తన అభిమానులను చిరంజీవి కడుపుబ్బా నవ్వించబోతున్నారని చెబుతున్నారు. ఈ వార్తతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
Chiranjeevi
Trivikram Srinivas
Tollywood
New Movie
Comedy Role

More Telugu News