KTR: చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

KTR wishes his sister Kavitha on her birthday
  • నేడు కల్వకుంట్ల కవిత జన్మదినం
  • హ్యాపీ బర్త్ డే పప్ అంటూ కేటీఆర్ ట్వీట్
  • సోదరి జీవితంలో సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్ష
టీఆర్ఎస్ మహిళా నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కవితకు ఆమె సోదరుడు కేటీఆర్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. "హ్యాపీ బర్త్ డే పప్" అంటూ కవిత ముద్దుపేరుతో ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. "నీ జీవితంలో సంతోషం నిండాలని, మంచి ఆరోగ్యం, సుఖశాంతులు ఉండేలా దీవెనలు లభించాలని కోరుకుంటున్నా" అంటూ చెల్లిపై అపారమైన ప్రేమాభిమానాలు కురిపించారు.
KTR
K Kavitha
Birthday
TRS
Telangana

More Telugu News