Noida: నోయిడాలో ఓ ఉద్యోగికి కరోనా.. కంపెనీలోని 707 మందిని క్యారంటైన్ చేసిన అధికారులు

707 employess quarantined in Noida company
  • నోయిడాలోని ఓ కంపెనీలో పని చేస్తున్న యువకుడు
  • ఇటీవలే చైనా, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లి వచ్చిన వైనం
  • కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు
కంపెనీలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మొత్తం ఉద్యోగులను ఐసొలేషన్ కు పంపించిన ఘటన నోయిడాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, నోయిడాలోని ఓ కార్పొరేట్ కంపెనీలో ఢిల్లీకి చెందిన ఒక యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీ పనుల మీద అతను ఇటీవల చైనా, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించాడు.

ఇండియాకు వచ్చిన ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో... అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, వైద్యాధికారులు, అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని క్యారంటైన్ చేశారు. దీనికి తోడు కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 707 మంది ఉద్యోగులను కూడా క్వారంటైన్ కు తరలించారు. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరివల్ల వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీరిని విడిగా ఉంచి పరీక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు.
Noida
Corona Virus
Corporate Company
707 Employees
Quarantine

More Telugu News