KCR: విద్యుత్‌ సంస్థలు బతకాలంటే చార్జీలు పెంచక తప్పదు: అసెంబ్లీలో స్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌

  • పేదలకు ఇబ్బంది లేకుండా పెంపుదల వుంటుంది 
  • అలాగే పన్ను పెంచడం కూడా అనివార్యం
  • గ్రామాభివృద్ధికి ఇవి అత్యవసర చర్యలు
KCR hints for hike in electricity charges and taxes

విద్యుత్‌ సంస్థలు బతకాలంటే చార్జీలు పెంచాలని, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పన్ను పెంచాలని, పాలనలో ఇవి తప్పనిసరిగా చేపట్టాల్సిన పనులని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. అయితే నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే పెంపు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. పేదలపై ఎటువంటి భారం పడకుండా విద్యుత్‌ చార్జీలు పెంచుతామని, పన్ను చెల్లించే స్తోమత ఉన్న వారిపైనే పన్ను భారం వేస్తామని తెలిపారు.

ఈరోజు అసెంబ్లీలో పల్లెప్రగతి కార్యక్రమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘ప్రజలు మాపై విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారు. ఓట్ల రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. అందుకే ప్రజల విశ్వాసాన్ని కాపాడుకునేలా పాలన కొనసాగిస్తున్నాం’ అని తెలిపారు. గ్రామాలు బాగుపడాలంటే ప్రజా సహకారంతోనే సాధ్యమవుతుందని, ప్రతి పంచాయతీకి ఐదు లక్షల రూపాయలు ఆదాయం వచ్చే మార్గాలను చూపించామని, అవి కొనసాగేలా ప్రజలు తోడ్పాటు అందించాలని కోరారు.

More Telugu News