Salman Khan: అమెరికా, కెనడా టూర్లను వాయిదా వేసుకున్న సల్మాన్ ఖాన్

Salman Khans US and Canada event pushed ahead
  • ఎంటర్టైన్మెంట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా వైరస్
  • ఇప్పటికే షూటింగులు వాయిదా
  • వాయిదా పడ్డ 'అప్, క్లోజ్ అండ్ పర్సనల్ విత్ సల్మాన్ ఖాన్' ఈవెంట్లు
ఎంటర్టైన్మెంట్ రంగంపై కరోనా వైరస్  పెను ప్రభావాన్ని చూపుతోంది. షూటింగులు, సినిమా ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి. సెలబ్రిటీలు తమ విదేశీ పర్యటనలను, ఈవెంట్లను రద్దు చేసుకోవడమో లేదా వాయిదా వేసుకోవడమో చేస్తున్నారు. అమెరికా, కెనడాల్లో జరగాల్సిన సల్మాన్ ఖాన్  'అప్, క్లోజ్ అండ్ పర్సనల్ విత్ సల్మాన్ ఖాన్' ఈవెంట్లు కూడా వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ కారణంగానే ఈ ఈవెంట్లను వాయిదా వేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఈవెంట్లు ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు జరగాల్సి వున్నాయి. 
Salman Khan
bollywood
USA
Canada
Events
Postpone

More Telugu News