BSE Loss: ఊహించినట్టే జరిగింది.. ఒక్క నిమిషంలో మరో రూ. 13 లక్షల కోట్లు హాంఫట్!

Stock Market Loss
  • 5 నిమిషాల్లో 2,640 పాయింట్ల నష్టం
  • గురువారంతో పోలిస్తే 8 శాతం పతనం
  • 8,800 వద్ద నిఫ్టీకి లభించని మద్దతు
ఊహించినట్టుగానే భారత స్టాక్ మార్కెట్ నిన్నటి పతనాన్ని కొనసాగించింది. ఈ ఉదయం 9.15 గంటలకు మార్కెట్ సెషన్ ప్రారంభంలోనే క్రితం ముగింపుకన్నా 1500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, 9.20 గంటల సమయానికి 3,090 పాయింట్ల నష్టంలోకి వెళ్లిపోయింది. గురువారం ముగింపుతో పోలిస్తే ఇది 9.43 శాతం పతనం. ప్రస్తుతం బీఎస్ఈ సూచిక 30,137 పాయింట్లకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం అదే దారిలో పయనిస్తూ, 852 పాయింట్లు పడిపోయి, 8,737 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

నిన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 1,37,12,558.72 కోట్లుగా ఉండగా, ఈ ఉదయం అది మరో రూ. 9 లక్షల కోట్లకు పైగా తగ్గి, 1,24,11,324 కోట్లకు చేరుకుంది. ఎన్ఎస్ఈ-50, బీఎస్ఈ-30లోని అన్ని కంపెనీలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో సైతం నష్టాల తీవ్రత అధికంగా ఉంది. కాగా, 8,800 పాయింట్ల వద్ద కొనుగోలు మద్దతును కూడగట్టుకోవడంలో నిఫ్టీ విఫలం కాగా, ఈ పతనం మరింత అధికం కావచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
BSE Loss
SENSEX
NIFTY
Stock Market

More Telugu News