ఊరేగింపుగా మండపానికి పెళ్లి కొడుకు.. బేడీలు వేసి కటకటాల్లోకి పంపిన పోలీసులు
- ఓ హత్యాకాండలో వరుడు ప్రధాన నిందితుడు
- పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం
- అరెస్ట్‌తో ఆగిన పెళ్లి
కటక్ జిల్లాలోని అఠొగొడొ బీరోకిషోపూర్‌లోని శివాలయంలో నిన్న వీరి పెళ్లి జరగాల్సి ఉంది. వరుడు ఊరేగింపుగా పెళ్లి మండపానికి బయలుదేరాడు. గతంలో జరిగిన ఓ హత్యాకాండలో వరుడు ప్రధాన నిందితుడు. అతడి కోసం గాలిస్తున్న పోలీసులకు నిందితుడు పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం అందింది. వెంటనే ఊరేగింపు వద్దకు చేరుకున్న పోలీసులు వరుడికి అరదండాలు వేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది.