Corona Virus: సినిమా హాల్స్ అన్నీ మూసివేయండి: నెల్లూరు కలెక్టర్ ఆదేశం

Nellore Collector Order to close Movie Theaters over Corona Fear
  • నెల్లూరులో నమోదైన తొలి కరోనా కేసు
  • థియేటర్ యజమానులతో కలెక్టర్ సమావేశం
  • 14 అనుమానిత కేసులు కూడా
విదేశాల నుంచి నెల్లూరు వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీలో ఇదే తొలి కేసు కాగా, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నెల్లూరు కలెక్టర్ ఎంవీ శేషగిరి బాబు స్వయంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన ఆయన, జిల్లాలోని మరో మూడు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను నిర్మించాలని సూచించారు.

సినిమా థియేటర్లు, హోటల్ యజమానులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్, కొన్ని రోజుల పాటు థియేటర్లు మూసి వేయాలని ఆదేశించారు. అన్ని షాపింగ్ మాల్స్ లో ప్రజలు మాస్క్ లను ధరించేలా చూడాలని, ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటివరకూ నెల్లూరులో 14 కరోనా అనుమానిత కేసులు నమోదు కాగా, వారందరినీ జీజీహెచ్ లోని ప్రత్యేక వార్డులో పరిశీలనలో ఉంచారు.
Corona Virus
Nellore District
First Case
Movie Theaters
Collector

More Telugu News