Corona Virus: జ్వరం లేకుంటేనే తిరుమలకు... భక్తులకు తిరుపతిలోనే థర్మల్ గన్ తో పరీక్షలు!

  • అలిపిరి, శ్రీవారిమెట్టు వద్ద థర్మల్ గన్స్
  • పరీక్షల అనంతరమే కొండపైకి అనుమతి
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Thermal Screening for tirumala piligrims

నిత్యమూ లక్షలాది మంది భక్తులు వచ్చి వెళుతుండే, తిరుమలకు కరోనా వైరస్ రాకుండా చూసేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి, శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాల్లో థర్మల్ గన్ లను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి కొండపైకి ఎక్కే ప్రతి ఒక్కరినీ ఈ గన్ తో పరీక్షిస్తారు. శరీరంలో జ్వర లక్షణాలు కనిపించక పోతేనే వారిని కొండపైకి అనుమతిస్తారు. ఒకవేళ సాధారణం కన్నా శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటే, పక్కనే ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ సెంటర్ లో తదుపరి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

కాగా, తిరుమలలో శ్రీవారి రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వ దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి దర్శనం పూర్తయ్యేందుకు 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ టోకెన్లు, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని తెలిపారు. నిన్న గురువారం స్వామివారిని 61,652 మంది దర్శించుకోగా, 22,756 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 2.34 కోట్ల ఆదాయం లభించింది.

More Telugu News