Master: విజయ్ కొత్త చిత్రం 'మాస్టర్' ఫస్ట్ లుక్ ఇదిగో!

Vijay new movie Master first look released
  • ఖైదీ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చిత్రం
  • విలన్ గా విజయ్ సేతుపతి
  • ఏప్రిల్ 9న విడుదల కానున్న 'మాస్టర్'
విజిల్ సినిమా తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం 'మాస్టర్'. తాజాగా 'మాస్టర్' చిత్రం ఫస్ట్ లుక్ రిలీజైంది. సీరియస్ లుక్ తో ఉన్న విజయ్ ని ఈ ఫస్ట్ లుక్ లో చూడొచ్చు. ఖైదీ చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న 'మాస్టర్' పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. 'మాస్టర్' చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండడంతో అంచనాలు మరో స్థాయికి చేరాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన మాళవిక మోహనన్, ఆండ్రియా జెర్మియా నటిస్తున్నారు. ఈ బహుభాషా చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయనున్నారు.
Master
Vijay
First Look

More Telugu News