Budda Venkanna: వివేకా హత్య కేసులోనూ ఆయనే ఏ2: బుద్ధా
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులోనూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డే ఏ2 అని పేర్కొన్నారు. దారుణంగా జరిగిన హత్యను గుండెపోటు అని చిత్రీకరించారని, సీబీఐ విచారణ ఏ2 నుంచి మొదలుపెట్టాలని కోరారు. గుండెపోటు దగ్గర్నుంచి విచారణ మొదలుపెడితే వివేకా కేసు వెనుక ఉన్న జగన్ పోటు బయటపడుతుందని సూచించారు.