MLC Deepak Reddy: చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారు: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి

TDP MLC Deepak Reddy fires on minister Peddireddy followers
  • టీడీపీ అభ్యర్థులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపణ
  • అరాచకం జరుగుతుంటే ఈసీ, పోలీసులు పట్టించుకోవడంలేదని వ్యాఖ్యలు
  • అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం
ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్ల ఘట్టం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలాచోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలతో హింస చోటుచేసుకుంటోంది. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పందిస్తూ, చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత అరాచకం కొనసాగుతుంటే పోలీసు అధికారులు, ఈసీ ఏంచేస్తున్నట్టు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLC Deepak Reddy
Peddireddi Ramachandra Reddy
Chittoor District
Local Body Polls
YSRCP
Telugudesam

More Telugu News