Corona Virus: మహిళా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు వచ్చిన ప్రేక్షకుడికి కరోనా!

  • ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్‌
  • స్టేడియం నార్త్‌స్టాండ్‌లో కూర్చున్న వ్యక్తికి వైరస్ సోకినట్టు నిర్ధారణ
  • భయపడాల్సిన అవసరం లేదంటున్న స్టేడియం అధికారులు
Spectator at T20 World Cup final tests positive for coronavirus

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ క్రీడలను కూడా భయపెడుతోంది. కరోనా భయంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా టోర్నీలు వాయిదా పడడమో, రద్దవడమో జరుగుతోంది. ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎంసీజీలో ఆదివారం జరిగిన టీ20 మహిళా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు హాజరైన ఓ ప్రేక్షకుడికి కరోనా వైరస్‌ సోకినట్టు గుర్తించడం కలకలం రేపింది. ఈ విషయాన్ని మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్ అధికారులు బుధవారం ప్రకటించారు. ఎంసీజీ స్టేడియం నార్త్ స్టాండ్‌లోని ఎన్42 సెక్షన్‌లో ఆ వ్యక్తి కూర్చున్నారని చెప్పారు

అయితే, మ్యాచ్‌ రోజు ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రేక్షకులు, మైదానం సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆ వ్యక్తి నుంచి వాళ్లకు కరోనా సోకే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు. కాబట్టి వాళ్లంతా సాధారణంగా ఉండొచ్చని, కాకపోతే శుభ్రత పాటించాలని సూచించారు. దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు.

More Telugu News