Ashok Babu: వైసీపీ అరాచకాలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్​ బాబు

TDP Mlc Ashok Babu says we have filed 3 pills against ysrcp government
  • ఏపీ హైకోర్టులో మూడు పిల్స్ దాఖలు చేశాం
  • 12 జెడ్పీటీసీ, దాదాపు 470 ఎంపీటీసీల్లో ఎన్నికల రీ షెడ్యూల్ కోరాం
  • తగిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పిస్తాం
వైసీపీ అరాచకాలపై ఏపీ హైకోర్టులో మూడు పిల్స్ దాఖలు చేశామని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. 12 జెడ్పీటీసీ, దాదాపు 470 ఎంపీటీసీల్లో ఎన్నికల రీ షెడ్యూల్ కోరామని, రీషెడ్యూల్ కోరుతూ తగిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పిస్తామని చెప్పారు. తమ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అవరోధాలు కల్పించారని, నామినేషన్ల పరిశీలనా సమయంలోనూ పత్రాలు చించేసే దుస్థితి నెలకొందని ఆరోపించారు.

నిన్న మాచర్లలో టీడీపీ నాయకులపై దాడి ఘటన గురించి ఆయన ప్రస్తావిస్తూ, తమ నాయకులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లారని హోం శాఖ మంత్రి సుచరిత చెబుతున్నారని, ఆ మాట వాస్తవం కాదని అన్నారు. పోలీసులకు తాము ముందస్తు సమాచారం ఇవ్వడం వల్లే ఆ సమాచారం వైసీపీకి చేరిందని ఆరోపించారు. పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చిన విషయాన్ని తాము నిరూపిస్తామని, నిరూపిస్తే కనుక హోం మంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.
Ashok Babu
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News