AP DGP: చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై హైకోర్టుకు హాజరైన డీజీపీ

AP DGP Gautam Sawang attends to High Court
  • ఇటీవల విశాఖలో చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకత
  • బాబుకు 151 సీఆర్పీసీ కింద నోటీసులు
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ నేతలు
  • వివరణ ఇవ్వాలంటూ డీజీపీని ఆదేశించిన హైకోర్టు
ఇటీవల చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లగా అక్కడ ఆయనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముందస్తు అనుమతి తీసుకుని విశాఖ వచ్చినా ఆయనకు పోలీసులు 151 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించేశారు. దీనిపై హైకోర్టులో టీడీపీ నేతల నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా, ఈ వ్యవహారంలో విచారణ జరిపిన న్యాయస్థానం వివరణ ఇవ్వాల్సిందిగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించింది. దాంతో ఆయన ఇవాళ హైకోర్టు ముందు హాజరయ్యారు. కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AP DGP
Gautam Sawang
AP High Court
Chandrababu
Vizag

More Telugu News