Visakhapatnam: వైసీపీలో టికెట్ల లొల్లి.... విశాఖ కార్యాలయం ముందు కార్యకర్తల ఆందోళన!

YSRCP cader protest againist tickets issue
  • నమ్మిన వారిని నాయకులు నట్టేట ముంచారని ధ్వజం 
  • నేతల కుటుంబ సభ్యులకే టికెట్లని ఆరోపణ 
  • గెలిచే వారికి ఇవ్వాలని డిమాండ్

విశాఖ నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి మొదలయ్యింది. వార్డుల వారీగా టికెట్ల కేటాయింపు మొదలవ్వడంతో అసంతృప్తులు తమ గళం వినిపిస్తున్నారు. ఈరోజు ఉదయం పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ నగర కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

ఎప్పటి నుంచో పార్టీ జెండా మోసే వారిని, గెలిచే అవకాశం ఉన్న వారిని పక్కన పెట్టి నాయకుల కుటుంబ సభ్యులు, బంధువులకే టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. అధినాయకులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని, అలా కాకుండా ఇలాగే ముందుకు వెళితే పార్టీ పుట్టి మునగడం ఖాయమని హెచ్చరించారు. తక్షణం టికెట్ల కేటాయింపును పునఃపరిశీలించి గెలిచే వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Visakhapatnam
GVMC election
Tickets

More Telugu News