Telugudesam: గేట్లెక్కి నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన టీడీపీ మహిళా అభ్యర్థులు.. ఫొటోలు పోస్ట్ చేసిన టీడీపీ

tdp candidates go for filing nominations jumping over closed gates
  • మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఘటన
  • పోలీసులు అనుమతించలేదన్న టీడీపీ
  • నామినేషన్ వేసేందుకు మహిళా అభ్యర్థుల తిప్పలు 
'వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో తెలుగు దేశంపార్టీ అభ్యర్థుల దుస్థితి ఇది' అంటూ టీడీపీ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పలు వివరాలు వెల్లడిస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది.
                      
'పోలీసులు తెలుగు దేశంపార్టీ అభ్యర్థులను నామినేషన్ వేసేందుకు అనుమతించకపోవడంతో ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థులు ఇలా గేట్లెక్కి లోనికి వెళ్లాల్సి వచ్చింది' అని తెలిపింది. గేట్లు మూసేసి ఉండడంతో కొందరు మహిళలు గేట్లు ఎక్కడం ఈ ఫొటోల్లో కనపడుతోంది.

        
Telugudesam
Peddireddi Ramachandra Reddy
YSRCP

More Telugu News