Kajal Aggarwal: అల్లరి నరేశ్ తో కలిసి సందడి చేయనున్న కాజల్

Kajal Aggarwal and Allari Naresh to pair in Suresh Productions movie
  • కొరియ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సురేష్ ప్రొడక్షన్
  • చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిన కాజల్
  • త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామన్న సురేష్ బాబు
కాజల్ అగర్వాల్... తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి అగ్ర స్థానంలో కొనసాగిన నటి. ఇప్పుడు కొత్త భామలు వస్తుండటంతో ఆమె స్పీడ్ కొంచెం తగ్గింది. ప్రస్తుతం 'భారతీయుడు-2' చిత్రంలో కమలహాసన్ సరసన నటిస్తోంది.

తాజాగా తెలుగులో మరో సినిమాకు కాజల్ ఓకే చెప్పింది. కొరియాకు చెందిన 'డ్యాన్సింగ్ క్వీన్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కించబోతోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ తో పాటు కాజల్ కూడా నటించనుంది. ఈ విషయాన్ని నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ, తమ చిత్రంలో నటించేందుకు కాజల్ అంగీకరించిందని చెప్పారు. దర్శకుడు ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదని.. త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
Kajal Aggarwal
Allari Naresh
Tollywood
Suresh Productions
Daggubati Suresh Babu

More Telugu News