ఈ ఆర్డినెన్స్ ను వైసీపీ పక్కాగా పాటిస్తే ఎన్నికల తర్వాత జగన్ కు ‘సారీ’ చెప్పేందుకు సిద్ధం: కన్నా
- వైసీపీ అభ్యర్థులు మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికల్లో పాల్గొనాలి
- కొత్త చట్టానికి వైసీపీ అభ్యర్థులు కట్టుబడాలి
- లేనిపక్షంలో సీఎంగా ఉండే అర్హత జగన్ కు లేదు
ఈ కొత్త చట్టం ప్రతిపక్షాలను బ్లాక్ మెయిల్ చేయడానికేనని తాను భావిస్తున్నానని, అలా కాకుండా, వైసీపీ పక్కాగా, నిష్పక్షపాతంగా పాటించారని అనిపించుకుంటే, ‘ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ముఖ్యమంత్రికి ‘సారీ’ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా‘ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఆ పార్టీ వాళ్లే పాటించని పక్షంలో ముఖ్యమంత్రిగా ఉండే అర్హత జగన్ కు లేదని అన్నారు.