Sake Sailajanath: ఎన్నికల సంఘం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది: శైలజానాథ్

PCC Chief Sailajanath take a dig at YSRCP and election commission
  • నామినేషన్ల ముందు రోజు రిజర్వేషన్లు ప్రకటించడాన్ని తప్పుబట్టిన పీసీసీ చీఫ్
  • వైసీపీ ఆగడాలు ఎక్కువయ్యాయంటూ విమర్శలు
  • ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటారన్న నమ్మకంలేదని వ్యాఖ్యలు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల ముందు రోజు రిజర్వేషన్లు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైసీపీ దుశ్చర్యలు ఎక్కువయ్యాయని, అయితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారన్న నమ్మకం కలగడంలేదని అన్నారు. తమ ఫిర్యాదులు బుట్టదాఖలవుతాయన్న భావన కలుగుతోందని పేర్కొన్నారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Sake Sailajanath
Congress
YSRCP
EC
Local Body Polls
Andhra Pradesh
PCC

More Telugu News