Revanth Reddy: రేవంత్ రెడ్డికి చుక్కెదురు... బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన న్యాయస్థానం

Court rejects Revanth Reddy bail petition
  • కేటీఆర్ ఫాంహౌస్ పై డ్రోన్ ఎగరేసిన రేవంత్
  • అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారంటూ రేవంత్ అరెస్ట్
  • 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీపై జైలులో వున్న ఎంపీ
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు చెందిన ఫాంహౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారన్న కారణంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రేవంత్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ప్రస్తుతం చర్లపల్లి కారాగారంలో ఉన్న రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కూకట్ పల్లి న్యాయస్థానం నిన్న వాదనలు విని తీర్పును నేటికి వాయిదా వేసింది. ఇవాళ్టి విచారణ అనంతరం రేవంత్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయంతో రేవంత్ మరికొన్నిరోజుల పాటు జైల్లోనే ఉండక తప్పదు.
Revanth Reddy
Bail
Petition
KTR
Farm House

More Telugu News