Buddha: మా దేవుడు చంద్రబాబుపై నేను ప్రమాణం చేస్తా, మీ జగన్ పై నువ్వు ప్రమాణం చెయ్!: పిన్నెల్లికి బుద్ధా సవాల్

Buddha Venkanna challenges Pinnelli
  • మాచర్ల దాడి ఘటనలో పిన్నెల్లిని నిలదీసిన వెంకన్న 
  • దాడి వెనుక ఉన్నది పిన్నెల్లేనని ఆరోపణ
  • వైసీపీ నేతల సంస్కృతే అంత! అంటూ విమర్శలు
గుంటూరు జిల్లా మాచర్లలో తనపైనా, తన పార్టీ సహచరుడు బోండా ఉమపైనా జరిగిన దాడి ఘటన పట్ల టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ దాడి ఘటన వెనుక ఉన్నాడని ఆరోపించారు. వైసీపీ నేతల సంస్కృతే దాడులు, దోచుకోవడాలు, దొంగలెక్కలు చేయడం అని విమర్శించారు. తమకు పార్టీలో ప్రతి మూడు నెలలకు ఓసారి క్లాసులు ఉంటాయని, నిజాయతీగా ఉంటూ ప్రజలకు ఎలా సేవ చేయాలో తమ నాయకుడు బోధిస్తారని తెలిపారు.

"కానీ మీకు జరిగే క్లాసులు వేరే. మీ నాయకుడేమో ఎలా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలి, చంపడం, నరకడం నేర్పిస్తారు. దాడి జరిగిన ఐదు నిమిషాల్లోనే తప్పుడు ప్రకటనతో మీ నైజం చాటుకున్నారు. ఇప్పుడు నేనేదో అది చేస్తాను, ఇది చేస్తాను అనడంలేదు. మాకు దైవం చంద్రబాబునాయుడే. బోండా ఉమ చెప్పిందంతా నిజమేనని మా దేవుడు చంద్రబాబుపై ప్రమాణం చేస్తా. నువ్వు చెప్పేదంతా నిజమని నీ నాయకుడు జగన్ పై ప్రమాణం చేయాలి. నువ్వు ప్రమాణం చేశావంటే మీ కార్యకర్తలకు తెలిసిపోతుంది... తప్పుడు ప్రమాణం చేశావని. నువ్వు జగన్ పై ప్రమాణం చేశావంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా... ఈ చాలెంజ్ కు సిద్ధమేనా?" అంటూ పిన్నెల్లికి బుద్ధా సవాల్ విసిరారు.
Buddha
Chandrababu
Pinnelli
Jagan
Telugudesam
YSRCP
Macherla

More Telugu News