Murali Mohan: నా అసలుపేరు రాజా రామ్మోహన్ రాయ్: సీనియర్ నటుడు మురళీమోహన్

Murali Mohan
  • మా నాన్నగారు స్వాతంత్ర్య సమరయోధులు 
  •  కాలేజ్ రోజుల్లో నన్ను రాజబాబు అని పిలిచేవారు
  • నా పేరు మార్చింది ఆయనేనన్న మురళీమోహన్

తెలుగు తెరపై తమ ప్రత్యేకతను చాటుకున్న నిన్నటితరం కథానాయకులలో మురళీమోహన్ ఒకరు. కథానాయకుడిగా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన అనేక విభిన్నమైన పాత్రలను పోషించారు. అలాంటి మురళీమోహన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "మా నాన్నగారు స్వాతంత్ర్య సమరయోధులు. అందువలన ఆయన నాకు 'రాజా రామ్మోహన్ రాయ్' అనే పేరు పెట్టారు.

అయితే కాలేజ్ రోజుల్లో అంత పెద్ద పేరును పిలవలేక, అంతా 'రాజబాబు' అని పిలవడం మొదలుపెట్టారు. సినిమాల్లోకి వచ్చాక, 'ఆల్రెడీ ఒక రాజబాబు వున్నాడు కదా ..  పేరు మార్చుకోండి' అని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుగారు అన్నారు. దాంతో నా పేరును 'మోహన్' గా మార్చుకున్నాను. అయితే 'ఆంధ్రపత్రిక' జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు, 'సార్ మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టుగా వుంది. కృష్ణమోహన్ .. రామ్మోహన్ .. మురళీమోహన్.. అలా వుంటే బాగుంటుంది' అన్నారు. అయితే మురళీమోహన్ బాగుందని చెప్పేసి ఓకే అనేశాను" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News