Police: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది పోలీసులతో తనిఖీలు

  • పోలీసు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల మెరుపు దాడులు
  • నాటుసారా తయారీ కేంద్రాలపై ఉదయం 4 గంటల నుంచి దాడులు
  • పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలు స్వాధీనం
  • ఎన్నికల్లో మద్యం పంపిణీని కట్టడి చేసేందుకు ముమ్మర తనిఖీలు
police rides in ap

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా మద్యం ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పటిష్ఠ కార్యాచరణ రూపొందించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది పోలీసులతో తనిఖీలు కొనసాగుతున్నాయి.

పోలీసు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల మెరుపు దాడులు చేస్తున్నారు. నాటుసారా తయారీ కేంద్రాలపై ఉదయం 4 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల్లో పూర్తిగా మద్యం పంపిణీని కట్టడి చేసేందుకు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది సోదాలు చేస్తున్నారు. చిత్తూరులో మొత్తం 12 వేల లీటర్ల నాటుసారాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News