Kesineni Swetha: కేశినేని నాని కుమార్తెను ఎన్నికల బరిలోకి దింపిన చంద్రబాబు

Kesineni Nani daughter Kesineni Swetha to contest as Vijayawada Mayor candidate
  • విజయవాడ కార్పొరేషన్ మేయర్ టీడీపీ అభ్యర్థిగా కేశినేని శ్వేత
  • అధికారికంగా ప్రకటించిన టీడీపీ
  • గతంలో హిల్లరీ క్లింటన్ తరపున ప్రచారం చేసిన శ్వేత
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా శ్వేతను ఆ పార్టీ అధినేత చంద్రబాబు బరిలోకి దింపారు. ఈ మేరకు టీడీపీ హైకమాండ్ అధికారిక ప్రకటన చేసింది. కేశినేని నాని రెండో కుమార్తె శ్వేత. గత రెండు లోక్ సభ ఎన్నికల్లో తన తండ్రి తరపున శ్వేత విస్తృతంగా ప్రచారం చేశారు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తరపున కూడా ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. హిల్లరీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు.
Kesineni Swetha
Kesineni Nani
Daughter
Telugudesam
Vijayawada
Mayor Candidate

More Telugu News