TG Venkatesh: బీజేపీకి పవన్ కల్యాణ్ మసాలా ఫ్లేవర్ లాంటివాడు: టీజీ వెంకటేశ్

TG Venkatesh calls Pawan kalyan masala flavor to BJP
  • బీజేపీకి ఉన్న క్యాడర్ పవన్ కు ఉపయోగపడుతుందన్న టీజీ
  • బీజేపీకి అనుకూలంగా ఉన్నంత కాలం వైసీపీకి మద్దతు ఉంటుందని వెల్లడి
  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తుందని వ్యాఖ్యలు
ఇటీవలే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి పవన్ కల్యాణ్ మసాలా ఫ్లేవర్ లాంటివాడని అభివర్ణించారు. బీజేపీకి ఉన్న క్యాడర్ పవన్ కల్యాణ్ కు ఉపయోగపడుతుందని అన్నారు. ఇక, బీజేపీ భావాలకు అనుకూలంగా ఉన్నంతకాలం వైసీపీకి మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. కర్నూలులో హైకోర్టును బీజేపీ స్వాగతిస్తుందని టీజీ తెలిపారు. బీజేపీ డిమాండ్ ను జగన్ అమలు చేస్తున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించాలని అన్నారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు.
TG Venkatesh
Pawan Kalyan
BJP
Janasena
YSRCP
Andhra Pradesh
AP High Court
Kurnool

More Telugu News