Brian Lara: టీమిండియాలో తన ఫేవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పిన లారా

Brian Lara reveals his favorite player in Team India
  • కేఎల్ రాహుల్ పై అభిమానం కురిపించిన లారా
  • రాహుల్ ఆట చూడడాన్ని ఆస్వాదిస్తానని వెల్లడి
  • క్లాస్ ఆటకు మరో పేరు రాహులేనని కితాబు
వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా టీమిండియా ప్రస్తుత క్రికెటర్లలో తన అభిమాన ఆటగాడు ఎవరో వెల్లడించాడు. టీమిండియా యువ ఆటగాడు కేఎల్ రాహుల్ ఆటకు తాను పెద్ద ఫ్యాన్ అని తెలిపాడు. రాహుల్ ఆడుతుంటే చూడడాన్ని ఎంతో ఆస్వాదిస్తానని లారా వివరించాడు.

 "క్లాస్ అనే పదానికి రాహుల్ పర్యాయపదం. సిసలైన బ్యాటింగ్ వినోదాన్ని అందించడంలో రాహుల్ తర్వాతే ఎవరైనా. చూస్తే రాహుల్ బ్యాటింగే చూడాలనిపించేలా అతని ఆటతీరు ఉంటుంది" అని వెల్లడించాడు. క్రీడా మ్యాగజైన్ స్పోర్ట్స్ స్టార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లారా ఈ వ్యాఖ్యలు చేశాడు. దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు చెప్పకుండా, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కేఎల్ రాహుల్ పేరు చెప్పడం ద్వారా లారా తన ప్రత్యేకత చాటుకున్నాడు.
Brian Lara
KL Rahul
Team India
West Indies
Cricket
Batting

More Telugu News