Prabhas: ప్రభాస్ సరసన నాయికగా కత్రినా కైఫ్?

Katrina Kaif opposite Prabhas in Nag Ashwin Movie
  • గతంలో తెలుగులో చేసిన కత్రినా 
  • ఆ తరువాత హిందీ సినిమాలతో బిజీ 
  • ప్రభాస్ సినిమా కోసం నడుస్తున్న సంప్రదింపులు
ప్రభాస్ ఇంతకు ముందు చేసిన 'సాహో' సినిమాలో ఆయన సరసన నాయికగా శ్రద్ధా కపూర్ నటించింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ఆయన సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఆ తరువాత సినిమాలోను బాలీవుడ్ భామనే ఆయన జోడీ కట్టనున్నట్టు తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక సినిమాను ప్లాన్ చేశాడు. ఇది పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని చెప్పాడు. ఆ తరువాత .. ఈ సినిమాలో నాయికలుగా దీపికా పదుకొనె .. ప్రియాంక చోప్రా పేర్లు ప్రధానంగా వినిపించాయి. కానీ ఇప్పుడు కత్రినా కైఫ్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. గతంలో తెలుగులో 'మల్లీశ్వరి'.. 'అల్లరి పిడుగు' సినిమాల తరువాత ఆమె ఇక్కడ చేయలేదు. మళ్లీ తెలుగు సినిమాల్లో చేయడానికి ఆమె కూడా ఆసక్తిని కనబరుస్తోందని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Prabhas
katrina kaif
Nag Ashwin Movie

More Telugu News