డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాకు ఆమోదం

10-03-2020 Tue 15:48
  • రెండు నెలల కిందట ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా
  • మూడు రాజధానుల నిర్ణయంపై బాధతో రాజీనామా
  • త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించే అవకాశం
Dokka Manikya Varaprasad resignation accepted
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల బాధను వ్యక్తం చేస్తూ అప్పట్లో ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన రాజీనామాకు తాజాగా అధికారిక ఆమోదం లభించింది. రెండు నెలల కిందట ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీకి గుడ్ బై చెప్పిన వరప్రసాద్ నిన్న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వరప్రసాద్ రాజీనామా ఆమోదం పొందడంతో త్వరలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.