Maruti Rao: పురుగుల మందు దుకాణం వద్ద మారుతీరావు కారు ఆపమన్నారు.. హైదరాబాద్‌లో గారెలు తెమ్మన్నారు: విచారణలో డ్రైవర్

maruti rao suicide case investigation
  • మిర్యాలగూడ నుంచి కారులో హైదరాబాద్‌కు మారుతీరావు
  • మార్గమధ్యంలో పురుగుల మందు దుకాణం వద్ద కారు దిగిన వైనం
  • హైదరాబాద్‌లో గారెల్లో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య?

ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతోన్న సైఫాబాద్‌ పోలీసులు పలు విషయాలు గుర్తించారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న వైశ్యాభవన్‌ గదితో పాటు ఆయన కారులో ఎలాంటి విషం డబ్బాలు కనపడలేదు. మూడు రోజుల క్రితం ఆయన మిర్యాలగూడ నుంచి తన కారులో డ్రైవర్‌ రాజేష్‌తో కలిసి ఇక్కడకు బయలుదేరాడు.

ఆ సమయంలో మార్గమధ్యంలో ఓ పురుగు మందుల దుకాణం వద్ద కారు ఆపాలని మారుతీరావు తనతో చెప్పారని డ్రైవర్‌ తెలిపాడు. అనంతరం మారుతీరావు ఆ దుకాణానికి వెళ్లి వచ్చాడు. దీంతో ఆ దుకాణంలోనే పురుగు మందు కొనుగోలు చేసి, మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిసింది.  

ఆర్యవైశ్య భవన్‌ చేరుకున్న అనంతరం డ్రైవర్‌తో గారెలు తెప్పించుకున్నాడు. వీటిలోనే మారుతీరావు పురుగుల మందు కలుపుకుని తిని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వైద్య నివేదిక వచ్చి తర్వాతే ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. మారుతీరావు చివరిగా మల్లేపల్లిలో ఉండే తన న్యాయవాది వెంకట సుబ్బారెడ్డితో ఫోనులో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

  • Loading...

More Telugu News