Junior NTR: ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫొటో ను షేర్ చేసిన జూ.ఎన్టీఆర్

Junior NTR shares a new pic of Holi with family members
  • కుటుంబసభ్యులతో హోలీ జరుపుకున్న తారక్
  • అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన జూ.ఎన్టీఆర్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
సినిమా షూటింగులతో నిరంతరం ఎంతో బిజీగా ఉండే జూనియర్ ఎన్టీఆర్... తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. షూటింగ్ స్పాట్ కు కూడా తన భార్య, పిల్లలను అప్పుడప్పుడు తీసుకొస్తుంటాడు. వీటికి సంబంధించి గతంలో కూడా అనేక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా తారక్ మరో క్యూట్ పిక్ ను అభిమానులతో పంచుకున్నాడు.

హోలీ సందర్భంగా తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో తారక్ షేర్ చేశాడు. 'అందరికీ హోలీ శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు. అందరూ తెల్లటి దుస్తులతో నవ్వులు చిందిస్తూ ఫొటోలో ఉన్నారు. రసాయనాలు లేని రంగులు ఇంకా చెప్పాలంటే స్వచ్ఛమైన పసుపుతో వారు హోలీ జరుపుకున్నట్టు కనపడుతోంది. మరోవైపు, ఈ ఫొటోను చూసి తారక్ అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Junior NTR
Holi
Family
Tollywood

More Telugu News