Rama Subba Reddy: టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరేందుకు సిద్ధమైన రామసుబ్బారెడ్డి

TDP leader Rama Subba Reddy decides to join YSRCP
  • రామసుబ్బారెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్
  • రెండు, మూడు రోజుల్లో వైసీపీలో చేరిక
  • వెళ్లకుండా బుజ్జగిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా అయిన కడపలో రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. జిల్లాలో టీడీపీ కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైకిల్ దిగేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీలో ఆయన చేరబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మరోవైపు తన అనుచరులు, మద్దతుదారులతో రామసుబ్బారెడ్డి పార్టీ మార్పుపై చర్చలు జరుపుతున్నారు. రెండు, మూడు రోజుల్లో జగన్ సమక్షంలో రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, రామసుబ్బారెడ్డిని జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు, రామసుబ్బారెడ్డి రాకను వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నప్పటికీ... జగన్ నిర్ణయం తీసుకోవడంతో మౌనంగా ఉండిపోయారని సమాచారం.
Rama Subba Reddy
Telugudesam
YSRCP
Jagan

More Telugu News