Padala: ఆంధ్రప్రదేశ్ మహిళ పడాల భూదేవికి రాష్ట్రపతి నారీశక్తి పురస్కారం

  • గిరిజనుల కోసం పాటుపడుతున్న పడాల భూదేవి
  • భూదేవి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా
  • మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం
  • రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పురస్కారం అందుకున్న భూదేవి
AP woman Padal Bhudevi conferred with Narishakti award

వివిధ రంగాల్లో ఉన్నతస్థానానికి ఎదిగిన మహిళలు, విశిష్ట సేవలు అందించిన మహిళలకు అందించే నారీశక్తి పురస్కారం ఏపీకి చెందిన పడాల భూదేవికి కూడా లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పడాల భూదేవి అవార్డు అందుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవి గిరిజనుల కోసం ఎంతో కృషి చేస్తున్నారు.

1996లో ఆమె తండ్రి 'చిన్నై ఆదివాసి వికాస్ సొసైటీ' స్థాపించారు. ఆ సొసైటీ తరఫున భూదేవి గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారు. ముఖ్యంగా గిరిజన స్త్రీలు, వితంతువుల అభివృద్ధి కోసం ఆమె చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా, గిరిజనులు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా పోడుభూముల అభివృద్ధికి పడాల భూదేవి నిర్వహిస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ కారణంగానే ఆమె రాష్ట్రపతి నారీశక్తి అవార్డుకు ఎంపికైంది.

More Telugu News