Nadendla Manohar: ఈ నెల 12న జనసేన–బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం: నాదెండ్ల మనోహర్​

Nadendla Manohar announces we will release Janasena and Bjp joint manifesto on 12th
  • ఇరు పార్టీలు కలిసి అన్ని స్థానాల్లో పోటీ చేస్తాయి
  • రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతాం
  • ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది
ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన, బీజేపీలు సమావేశమయ్యాయి. ఈ సమావేశం అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈ నెల 12న బీజేపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ను విడుదల చేస్తామని వెల్లడించారు. ఇరు పార్టీలు కలిసి అన్ని స్థానాల్లో పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతామని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరు గురించి ప్రజలకు తెలియజేస్తామని అన్నారు.
Nadendla Manohar
Janasena
BJP
Local Body Polls
Joint manifesto

More Telugu News