Varla Ramaiah: వైసీపీకి మరోమారు అవకాశం కల్పిస్తే మన నాశనాన్ని మనం కోరుకున్నట్టే: వర్ల రామయ్య

Varla Ramaiah questions YSRCP government
  • ఏపీలో స్థానిక ఎన్నికలపై ప్రశ్నలు గుప్పించిన వర్ల రామయ్య
  • వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఓ పాంప్లేట్ విడుదల
  • మా ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఇది అనువైన సమయం కాదని టీడీపీ నేతలు అంటున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై ఆ పార్టీ నేత వర్ల రామయ్య మరోమారు విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పాంప్లేట్ ను విడుదల చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీకి మరోమారు అవకాశం కల్పిస్తే ‘మన నాశనాన్ని మనం కోరుకున్నట్టే’ అని, స్థానిక ఎన్నికలపై ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Varla Ramaiah
Telugudesam
Andhra Pradesh
Local Body Polls
YSRCP

More Telugu News