Trai: బుల్లితెర వీక్షకులకు ఇకపై 200 చానళ్లు ఉచితం

TRAI implements new policy that gives consumers more channels
  • ఇప్పటివరకు రూ.130 చెల్లిస్తే 100 చానళ్లే ఉచితం
  • నూతన విధానం తీసుకువచ్చిన ట్రాయ్
  • మార్చి 1 నుంచి అమలు
  • వినియోగదారుడిపై తగ్గనున్న భారం

ఇప్పటివరకు దేశంలో రూ.130 చెల్లిస్తే 100 ఉచిత చానళ్లు మాత్రమే చూసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడది 200 చానళ్లకు పెరిగింది. ట్రాయ్ కొత్త విధానం ప్రకారం రూ.130 చెల్లిస్తే 200 చానళ్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. పాత విధానంలో 100 చానళ్లకు పైబడి ఇతర చానళ్లు కోరుకుంటే ప్రతి 25 చానళ్లకు వినియోగదారుడు పాతిక రూపాయలతో పాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి వచ్చేది. ట్రాయ్ తాజా నిర్ణయంతో ఇప్పుడా బాధలేదు.

అంతేకాదు, పెయిడ్ చానళ్ల కనీస ధరను రూ.19 నుంచి రూ.12కి తగ్గించారు. తద్వారా పే చానళ్ల పరంగానూ వినియోగదారుడిపై భారం తగ్గనుంది. కస్టమర్ కోరుకున్న చానళ్లను స్థానిక కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు విధిగా అందించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఒక ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంటే రెండో కనెక్షన్ కు నెట్వర్క్ క్యారియర్ ఫీజులో 40 శాతం మాత్రమే వసూలు చేయాలని ట్రాయ్ స్పష్టం చేసింది. ట్రాయ్ నూతన విధానం మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది.

  • Loading...

More Telugu News