Local Body Polls: స్థానిక సంస్థల ఎన్నికల్లో అమరావతి గ్రామాలకు మినహాయింపు!

  • ప్రత్యేక కార్పొరేషన్ గా రాజధాని గ్రామాలు
  • మరికొన్ని గ్రామాలను ఇతర మున్సిపాలిటీల్లో కలిపే ప్రతిపాదనలు
  • ఆయా గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయిస్తూ ఆదేశాలు
No local body polls in Amaravathi villages

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ విడుదలైంది. అయితే, రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోవని తెలుస్తోంది. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువస్తుండడం ఓ కారణమైతే, కొన్నిగ్రామాలను ఇతర మున్సిపాలిటీల్లో విలీనం చేస్తుండడం మరో కారణం. తుళ్లూరు మండలంలోని గ్రామాలతో పాటు నీరుకొండ, నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాలను కలుపుకుని అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా, మంగళగిరి పురపాలికల్లో బేతపూడి, నవులూరు, యర్రబాలెం గ్రామాలను కలపాలని, తాడేపల్లి మున్సిపాలిటీలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలను కలపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఆయా గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News