KCR: హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

CM KCR calls it is the Budget with reality
  • మేనల్లుడికి కేసీఆర్ అభినందనలు
  • కేంద్రం నుంచి నిధుల కోత ఉన్నా మెరుగైన బడ్జెట్ అందించారని ప్రశంసలు
  • ఇది వాస్తవిక బడ్జెట్ అంటూ వ్యాఖ్యలు
ఇవాళ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ ఆదాయానికి, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్ అని అభివర్ణించారు. ఇది సంక్షేమ తెలంగాణ కోసం తయారైన బడ్జెట్ అని పేర్కొన్నారు. సకల వర్గాల సంక్షేమం, అన్ని రంగాల పురోగతిపై తమ ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయంటూ సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచే వచ్చే నిధుల్లో కోత విధించినా, రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలగకుండా బడ్జెట్ లో ప్రతిపాదనలు రూపొందించారని తన మేనల్లుడు హరీశ్ రావును అభినందించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా సాధ్యమైనంత మెరుగైన బడ్జెట్ ను అందించారంటూ మంత్రులను, అధికారులను మెచ్చుకున్నారు.​
KCR
Harish Rao
Budget
Telangana
TRS

More Telugu News