Maruti Rao: పోస్టుమార్టం అనంతరం మారుతీరావు మృతదేహాన్ని భార్యకు అప్పగించిన పోలీసులు

Postmortem completed for Maruti Rao dead body
  • అనుమానాస్పద స్థితిలో మరణించిన మారుతీరావు
  • ఉస్మానియాలో మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం
  • మృతదేహం మిర్యాలగూడ తరలింపు
ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడైన మారుతీరావు అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన అనంతరం మారుతీరావు మృతదేహాన్ని భార్య గిరిజకు అప్పగించారు.

మారుతీరావు అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయం తెలియరాలేదు. మారుతీరావు మృతికి గల కారణాలు అంతు చిక్కకపోగా, ఆయన ఎలా చనిపోయాడన్నదానిపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.  మారుతీరావు మృతదేహాన్ని స్వస్థలం మిర్యాలగూడకు తరలిస్తున్నారు. కాగా, ఇటీవల మారుతీరావుకు చెందిన ఓ షెడ్ లో మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
Maruti Rao
Death
Pranay
Amrutha
Hyderabad
Miryalaguda

More Telugu News