Physiotherapist: మనసిచ్చిన వాడిని మనువాడే వీల్లేక హైదరాబాద్ లో మహిళా ఫిజియో ఆత్మహత్య

Lady physio commits suicide in Hyderabad
  • మియాపూర్ లో ఘటన
  • ఫ్యాన్ కు ఉరేసుకున్న తన్మయి
  • తల్లిదండ్రులు వేరే సంబంధం చూశారని మనస్తాపం
హైదరాబాదులోని మియాపూర్ లో ఓ మహిళా ఫిజియోథెరపిస్ట్ బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఆర్బీఆర్ కాంప్లెక్స్ లోని తమ ఫ్లాట్ లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ కు చెందిన తన్మయి కొంతకాలంగా తన సోదరుడితో కలిసి మియాపూర్ లో నివాసం ఉంటోంది. తన్మయి హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫిజియోగా సేవలు అందిస్తోంది. ఆమె కొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది. అతడ్నే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పగా, వారు అందుకు నిరాకరించారు.

ఆమెకు మరో యువకుడితో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన తన్మయి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంత తలుపుకొట్టినా తీయకపోవడంతో  ఆమె సోదరుడు కిటికీలో నుంచి చూడడంతో తన్మయి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. తెల్లవారితే మహిళా దినోత్సవం అనగా, ఓ యువతి అర్ధంతరంగా తనువు చాలించడం అక్కడి వారిని కలచివేసింది.
Physiotherapist
Hyderabad
Miyapur
Warangal
Suicide
Police

More Telugu News