Telangana: తెలంగాణ బడ్జెట్​ రూ. 1,82,914.42 కోట్లు

Telangana budget  Rs 182914 crores
  • వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టామన్న మంత్రి హరీశ్ రావు
  • ద్రవ్య లోటు  33,191.25 కోట్లుగా ఉన్నట్టు వెల్లడి
  • కేసీఆర్ దార్శనికతతో బడ్జెట్ రూపొందించామని వ్యాఖ్య
2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు రూ. 1,82,914.42 కోట్లతో అసెంబ్లీలో బడ్జెట్  ప్రవేశ పెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1, 38, 669.82 కోట్లు, మూలధన వ్యయం రూ. 22,061.18 కోట్లుగా చూపారు. రూ. 4,482.12 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని, మొత్తంగా ద్రవ్య లోటును  రూ. 33,191.25 కోట్లుగా అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.

వాస్తవిక దృక్పథంతో పెట్టాం

బడ్జెట్ ప్రతిపాదనలను వాస్తవిక దృక్పథంతో రూపొందించామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. బడ్జెట్ అంటే కేవలం కాగితాలపై వేసుకునే అంకెల లెక్కలే కాదని, అభివృద్ధికి మార్గం వేసే ప్రతిపాదనలని అన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమ నేత కేసీఆర్ అని.. ఆయన దార్శనికతతో తెలంగాణ ప్రగతి శీల రాష్ట్రంగా కొనసాగుతోందని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కేసీఆర్ సమగ్ర దృష్టి, శ్రద్ధాసక్తుల ప్రతిబింబమే ఈ బడ్జెట్ అని తెలిపారు.
Telangana
Telangana Assembly
Budget
Telangana Budget
Harish Rao

More Telugu News