Narendra Modi: ప్రధాని మోదీ ట్విట్టర్‌ ఖాతా నుంచి ట్వీట్లు చేస్తోన్న మహిళలు!

women tweets from modi twitter
  • మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మోదీ ట్విట్టర్‌ ఖాతా
  • #SheInspiresUs ట్యాగ్‌తో కొందరు మహిళల ట్వీట్లు
  • తొలి ట్వీటు చేసిన చెన్నై మహిళ స్నేహ మోహన్‌దాస్ 
ప్రధాని మోదీ ట్విట్టర్‌ ఖాతా నుంచి పలువురు మహిళలు ట్వీట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాను ఆదివారం తన ట్విట్టర్‌ ఖాతాను మహిళలకు ఇచ్చేస్తానంటూ ఆయన ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో #SheInspiresUs ట్యాగ్‌తో కొందరు మహిళలు చేస్తోన్న ట్వీట్లు ఆయన ట్విట్టర్ ఖాతాలో కనపడుతున్నాయి.

మోదీ ట్విట్టర్‌ ఖాతాలో తొలి ట్వీటును చెన్నైకి చెందిన స్నేహ మోహన్‌దాస్ అనే మహిళ చేసింది. పేదల అకలి బాధలు తీర్చేందుకు ఆమె ‘ఫుడ్‌ బ్యాంక్’ సంస్థను స్థాపించి సేవలందిస్తున్నారు.  తనకు ఇష్టమైన పని చేయడంలో సంతృప్తి ఉంటుందని, తనతో కలిసి పని చేసేందుకు తన తోటి పౌరులకు స్ఫూర్తి కలిగించాలని అనుకుంటున్నానని తెలిపింది.

ఆకలి బాధతో ఉన్న ఒక వ్యక్తికి ఇతరులు ఆహారాన్ని అందించాలని,  ప్రపంచాన్ని ఆకలి బాధ లేనిదిగా మార్చాలని ఆమె పిలుపునిచ్చారు.  తమకు 20 విభాగాలు ఉన్నాయని, సామూహిక వంటలు, వంటల మారథాన్లు నిర్వహిస్తామని చెప్పారు. తల్లిపాలను పిల్లలకు ఇవ్వడం వల్ల కలిగే ఉపయోగాలు వంటి వాటి గురించి మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. అలాగే, పలువురు స్ఫూర్తివంతమైన మహిళలు మోదీ ఖాతా ద్వారా తమ సందేశాలు ఇస్తున్నారు.
Narendra Modi
BJP
Twitter

More Telugu News