Eatala Rajender: కరోనా నేపథ్యంలో తనపై కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలను వెల్లడించిన మంత్రి ఈటల

Eatala Rajender tells how his family reacted over corona scares
  • ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నారని ఈటలపై కుటుంబ సభ్యుల చిరుకోపం
  • ఆఫీసులోనే స్నానం చేసి ఇంటికి రావాలని సూచన
  • కరోనా లేకుండా మాస్కు ధరించడం ఎందుకున్న ఈటల
తెలంగాణలో కరోనా అనుమానిత కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారో వెల్లడించారు.

"మీరు నిత్యం ఎక్కడికంటే అక్కడికి వెళుతున్నారు, కరోనా అనుమానితులతో సన్నిహితంగా మెలుగుతున్నారు, అలాగే ఇంటికి వస్తే ఊరుకునేది లేదు.... శుభ్రంగా ఆఫీసులోనే స్నానం చేసి అప్పుడు ఇంటికి రండి అని మా వాళ్లు అంటున్నారు" అని ఈటల వివరించారు.

పైగా తాను మాస్కు లేకుండానే తిరుగుతుండడం పట్ల కూడా వివరణ ఇచ్చారు. కరోనా ఉన్నప్పుడే మాస్కు ధరించాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు ఇతరులపై పడకుండా ఉండేందుకే మాస్కు అని తెలిపారు. కరోనా లేనప్పుడు మాస్కు ఎందుకని ప్రశ్నించారు.
Eatala Rajender
Corona Virus
Family Members
AP Assembly Session
Telangana

More Telugu News