RGV: కరోనా అందరినీ అల్లాడిస్తుంటే సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎక్కడ చచ్చారు?: వర్మ

Ram Gopal Varma jokes on corona virus
  • కరోనాను కూడా వదలని వర్మ
  • ట్విట్టర్ లో జోక్ పేల్చిన వైనం
  • కరోనా వైరస్ ను విలన్ గా అభివర్ణించిన వర్మ
తన వ్యాఖ్యలతో ఏ అంశంలోనైనా హాస్యం పుట్టించడంలో రామ్ గోపాల్ వర్మ చాతుర్యం తెలిసిందే. వర్మ తాజాగా ప్రాణాంతక కరోనా వైరస్ ను కూడా వదల్లేదు. దీనిపై ట్విట్టర్ లో ఓ జోకేశారు. "కరోనా వైరస్ ఈ భూమండలాన్ని ఓ విలన్ లా పట్టిపీడిస్తుంటే సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ తదితరులందరూ ఎక్కడ చచ్చారు? కరోనా దెబ్బకు జడుసుకుని ఇతర గ్రహాలకు పారిపోయారని మాత్రం చెప్పొద్దు!" అంటూ చమత్కరించారు.
RGV
Corona Virus
Superman
Batman
Spiderman

More Telugu News