Byreddy Rajasekar Reddy: ఇప్పటికే ఫినిష్ అయ్యాం... శ్రీశైలం డ్యామ్ కు ఏమన్నా జరిగితే రాష్ట్రం మిగలదు: బైరెడ్డి

Byreddy Rajasekhar Reddy questions AP government over Srisailam dam safety
  • శ్రీశైలం ప్రాజెక్టుకు ముప్పు ఉందన్న బైరెడ్డి
  • ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం
  • త్వరలోనే శ్రీశైలంలో మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడి
బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, శ్రీశైలం డ్యామ్ భద్రతకు ముప్పు ఉందన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై త్వరలోనే శ్రీశైలంలో బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు.

"ఏపీకి శ్రీశైలం ప్రాజెక్టు ప్రాణాధారం అని భావిస్తాం. అలాంటి ప్రాజెక్టుకు సేఫ్టీ లేదంటే ఎందుకు శ్రద్ధ చూపించడంలేదు? శ్రీశైలం డ్యామ్ కు ఏమన్నా జరిగితే ఆంధ్రప్రదేశ్ అవుట్! ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఫినిష్ అయ్యాం. మూడు రాజధానుల వ్యవహారంతోనూ ఫినిష్ అయ్యాం. పెట్టుబడులు వెళ్లిపోతుండడంతో ఫినిష్ అయ్యాం. ఎందుకు శ్రీశైలం విషయంలో చర్యలు తీసుకోవడం లేదు?" అంటూ ప్రశ్నించారు.
Byreddy Rajasekar Reddy
Srisailam
Dam
YSRCP
BJP

More Telugu News