Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్న యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Police caught cheater who traps girls using Vijay Devarakonda name
  • విజయ్ పేరుతో అమ్మాయిలకు వల
  • రివర్స్ గేమ్ ఆడిన విజయ్ దేవరకొండ టీమ్
  • అమ్మాయి పేరుతో మోసగాడితో చాటింగ్
  • హైదరాబాద్ రావాలంటూ ఆహ్వానం
  • నిజమేనని నమ్మి హైదరాబాద్ వచ్చిన మోసగాడు
  • వెంటనే అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు
ఇప్పటి యువ హీరోల్లో కొద్దికాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నది విజయ్ దేవరకొండ మాత్రమే. ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ కున్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. సరిగ్గా ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకుని ఓ మోసగాడు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో తానే విజయ్ దేవరకొండనని చెప్పుకుంటూ అమ్మాయిలకు వల విసురుతున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన విజయ్ దేవరకొండ టీమ్ పోలీసుల సాయంతో ఆ మోసగాడ్ని పట్టుకుంది.

సోషల్ మీడియాలో అమ్మాయి పేరుతో ఆ యువకుడితో చాటింగ్ చేసి ఫోన్ నెంబర్ సంపాదించారు. వెంటనే కలవాలి హైదరాబాద్ వచ్చేయి అని చెప్పడంతో నిజమేనని నమ్మిన మోసగాడు పోలీసులు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాడు. హైదరాబాద్ వచ్చిన అతడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు పీఎస్ కు తరలించారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఇతను మరో ఇద్దరు హీరోల పేరుతో నకిలీ ఐడీలు సృష్టించి పది మంది అమ్మాయిలను మోసం చేసినట్టు వెల్లడైంది.
Vijay Devarakonda
Cheater
Trap
Cyber Crime
Police
Hyderabad

More Telugu News